హెచ్​పీఎస్​ పూర్వవిద్యార్థికి ఐఐటీ ఢిల్లీ డాక్టరేట్

హైదరాబాద్, వెలుగు: హర్యానా రాష్ట్ర సీఎస్ గా విశేష సేవలందిస్తున్న తెలుగు వ్యక్తి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి టీవీఎస్ఎన్ ప్రసాద్ కు ఐఐటీ ఢిల్లీ డాక్టరేట్ అందించింది. ఆర్థిక శాస్త్రంలో ఆయన రాసిన పరిశోధన పత్రానికి డాక్టరేట్ ఇచ్చింది. ప్రసాద్ హెచ్ పీఎస్ పూర్వ విద్యార్థిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. హార్వర్డ్ వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఏడేండ్ల పాటు వరల్డ్ బ్యాంక్ లో పనిచేసి ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఎక్స్ పర్ట్ గా పేరు తెచ్చుకున్నారు. హర్యానా కేడర్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. పైనాన్స్ సెక్రటరీగా ఆ రాష్ట్ర ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. సెంట్రల్ సర్వీస్ లో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ ప్రాజెక్ట్ హెడ్ గా పని చేసి పర్యావరణం, నీటి వనరుల నిర్వహణలో కీలక పాత్ర వహించారు.