
దేశ సరిహద్దుల్లో నిఘా కోసం AI పవర్డ్ రోబోలను తయారు చేశారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో ముఖ్యంగా వివాదాస్పద సరిహద్దు భూభాగాల్లో ఈ రోబోలతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోబోలను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి సహకారంతో డా స్పాటియో రోబోటిక్ లేబొరేటరీ సంస్థ రూపొందించింది. ఈ రోబోలు రక్షణ డీఆర్డీఏ నుంచి కూడా గుర్తింపు పొందింది. భారత సైన్యం ఇప్పటికే నిఘా వ్యవస్థకోసం ఫీల్డ్ ట్రయల్ నిర్వహించినట్లు అధికారులు చెప్పారు.
AIతో రోబోటిక్ నిఘా
సరిహద్దుల్లో ప్రస్తుత భద్రత చర్యలకు భిన్నంగా ఈ రోబోటిక్ నిఘా వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటుందని డీఎస్ ఆర్ఎలస్ సీఈవో అర్నబ్ కుమార్ బర్మాన్ తెలిపారు. పోల్ ట్రావర్సల్ సామర్థ్యం, అడాప్టివ్ అబ్స్టాకిల్ నావిగేషన్, AI-ఆధారిత నిఘాతో కూడిన ఈ వ్యవస్థ సరిహద్దు రక్షణ, కీలకమైన మౌలిక సదుపాయాల నిఘా,వ్యూహాత్మక రక్షణ పరంగా గేమ్-ఛేంజర్ లాంటిది. సరిహద్దుల్లో భద్రత పరంగా తలెత్తుతున్న సవాళ్లను ఈ వ్యవస్థ పరిష్కరిస్తుందన్నారు.
ALSO READ | ఎయిర్ ఇండియాపై ఎంపీ సుప్రియా సూలే అసహనం
24గంటల నిఘా, కిష్టమైన భూభాగంలో నిరంతరాయంగా, నిరాటంకంగా పనిచేస్తుందన్నారు. ఈ వ్యవస్థలో సెన్సార్ నిఘా ఉంటుంది. దాడులను గుర్తించి నిరోధించే సామర్థ్యం కలిగి ఉంటుందని బర్మాన్ అన్నారు. సరిహద్దుల్లో డ్రోన్లు పంపడం, చొరబాటు యత్నాలు చేస్తే రోబోల సెన్సార్లు వెంటనే గుర్తించి నిరోధిస్తాయని చెప్పారు. జాతీయభద్రతను బలోపేతం చేసేలా మరిన్ని ఆవిష్కరణ చేస్తామన్నారు.