ప్రస్తుతం ఏనోట విన్నా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) పేరు మారు మోగిపోతోంది. భవిష్యత్ అంతా ఈ టెక్నాలజీదేనని టెక్ నిపుణులు అంటున్నారు. సులభంగా ఉద్యోగాలు పొందాలంటే సాఫ్ట్‌వేర్ రంగంలో కొనసాగాలంటే AI నేర్చుకోవడం తప్పదని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గౌహతి AI లో డిగ్రీని ప్రకటించింది. ఈ డిగ్రీని Coursera సహకారంతో JEE క్లియర్ చేయకుండానే ఈ కోర్సును అందుబాటులోకి తెస్తోంది.
గతంలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా AI (artificial intelligence training program 2023) శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏఐ ప్రాముఖ్యత పెరుగుతున్ననేపథ్యంలో చాలా కంపెనీలు AI కోర్సులను ప్రారంభించాయి. ప్రముఖ ఎడ్ టెక్ ప్లాట్ ఫారమ్ ఫిజిక్స్ వల్లా కంప్యూటర్ సైన్స్, AI లో నాలుగేళ్ల కోర్సును ప్రవేశపెట్టింది. సాఫ్ట్ వేర్ రంగంలో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు, విద్యార్థులకు అద్భుతమైన స్కిల్స్ అందించే లక్ష్యంగా ఈ కోర్సును ప్రారంభించారు.
TCS కొత్త AI వ్యాపార విభాగం
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS ) తన వ్యాపార అభివృద్ధిలో AI టెక్నాలజీతో కొత్త వ్యాపార విభాగాన్ని రూపొందించాలని నిర్ణయించింది. టీసీఎస్ కొత్త సీఈవో, ఎండీ కృతివాసన్ బాధ్యతలు చేపట్టాక కంపెనీ కార్యకలాపాల్లో పలు మార్పుల్లో భాగంగా ఉత్పాదక AI స్పేస్ లోని అవకాశాలను పొందేందుకు కంపెనీ వ్యాపార విభాగాన్ని ఏర్పాటు చేయనుంది.