హైదరాబాద్ ఐఐటీ విద్యార్దులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పీహెచ్‌డీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఫీజుల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. దాదాపుగా 200 విద్యార్థులు ఇన్‌స్టిట్యూట్ బయటకు వచ్చి తమ నిరసన తెలిపారు.
ఫీజులు పెంపుపై గత నెల జూన్ నుంచి వినతిపత్రాలు పంపినప్పటి నుంచి నిర్వహకులు స్పందించడం లేదని విద్యార్దులు అంటున్నారు. 2018లో ఒక సెమిస్టర్‌కు రూ.40 వేలు చెల్లించిన పీహెచ్‌డీ స్కాలర్‌లు ఇప్పుడు సెమిస్టర్‌కు రూ. 60 వేలు చెల్లిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.
యూనివర్శిటీకి చెల్లించే మెస్, హాస్టల్ ఫీజుల పైన రూ. 10 వేలు చెల్లించాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. దాదాపు మూడు గంటలకు పైగా విద్యార్థులు తమ నిరసనను కొనసాగించారు.