ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ( IIT కాన్పూర్ )లో సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్, NM-ICPS మిషన్ కింద సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సహకారంతో సైబర్ సెక్యూరిటీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. సైబర్‌స్పేస్, సైబర్ సమస్యల వంటి సాంకేతిక ప్రాథమిక అంశాల గురించి అభ్యాసకులకు లోతైన అవగాహనను అందించడం, రియల్ టైమ్ సైబర్‌సెక్యూరిటీ టెక్నిక్స్, పద్ధతులు, భద్రతకు సంబంధించిన మోడల్స్, సాధనాలు, సాంకేతికతలపై దృష్టి పెట్టడం ఈ ప్రోగ్రామ్ ముఖ్య లక్ష్యం.
ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ అనేది చాలా మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని, దాన్ని గుర్తించడానికి C3iHub తన పాత్రను పోషిస్తోందని ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ చెప్పారు. "ఈ కార్యక్రమం విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచి అధునాతన స్థాయి సైబర్ సెక్యూరిటీ వరకు నేర్చుకునేందుకు సహాయపడుతుందని, ఇది వారిని భవిష్యత్తుకు దోహదం చేస్తుంది" అని ఆయన తెలిపారు.
SC/ST విద్యార్థులకు ఉచిత ఎన్‌రోల్‌మెంట్, SC/ST యేతర విద్యార్థులకు నామమాత్రపు రుసుముతో విద్యార్థులు/నిపుణులందరికీ ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది. ఇది దేశంలో ఎక్కడి నుంచైనా అభ్యాసకులకు అందుబాటులో ఉంటుంది. ప్రోగ్రామ్ వ్యవధి ఎనిమిది వారాలు (వారానికి ఆరు గంటలు). వీటితో పాటు ప్రత్యక్ష సెషన్‌లు, ఆన్‌లైన్ అసైన్‌మెంట్‌లు, హ్యాండ్- ఆన్ వ్యాయామాలు ఉంటాయి.
ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత అభ్యాసకులు C3iHub నుంచి ప్రమాణపత్రాన్ని అందుకుంటారు. ఇది వారి వృత్తిపరమైన ప్రొఫైల్‌కు జోడింపుగా ఉపయోగపడుతుంది. మొదటి 100 మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. C3iHub సైబర్‌సెక్యూరిటీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ సైబర్‌స్పేస్, సైబర్ సమస్యల సాంకేతిక బేసిక్స్ గురించి లోతైన అవగాహనను అందించడంతో సహా అనేక కీలక లక్ష్యాలను కలిగి ఉంది.