దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇవి వెలుగు చూస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు రావడం కలకలం రేపుతోంది. ప్రతిరోజూ డైట్ పాటిస్తున్న వారు, జిమ్ చేస్తున్న వారు, హెల్దీగా ఉంటున్న వారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. కూర్చున్న చోటే కుప్పకూలుతున్నారు.
లేటస్ట్ గా ఇలాంటి ఘటనే ఐఐటీ కాన్పుర్ లో జరిగింది. కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ స్టేజ్ పై మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ విషాద ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ లో ఐఐటీ ఫ్రొఫెసర్ సమీర్ ఖండేకర్ డిసెంబర్ 23న సాయంత్రం పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో భాగంగా ఇన్ స్టిట్యూట్ ఆడిటోరియంలో ప్రస్తంగిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. స్టేజ్ పై మాట్లడుతుండగా ఒక్కసారిగా చెమటు పట్టాయి. తర్వాత ఛాతినొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. సమీర్ ఖండేకర్ ఐదేళ్ల నుంచి అధిక కొలెస్టరాల్ కు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. లండన్ లోని కేంబ్రిడ్జి వర్శిటీలో చదువుతున్న తన కుమారుడు ప్రవాహ ఖండేకర్ వచ్చాక అంత్యక్రియలు జరగనున్నాయి.