టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండో, సర్ఫేస్ కొత్త బాస్గా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావలూరిని నియమితులయ్యారు. ఇంతకుముందు డిపార్ట్ మెంట్ హెడ్ గా ఉన్న పనోస్ పనాయ్ అమెజాన్ లో చేరడంతో ఈ బాధ్యతలను పవన్ దావులూరికి అప్పగించారు. దావులూరు గత 23 యేళ్లుగా మైక్రోసాఫ్ట్ కు సేవలందిస్తున్నారు. వేర్వేరుగా నిర్వహించబడుతున్న విండోస్, సర్ఫేస్ ఇప్పుడు కొత్త బాస్ గా దావులూరి ఉంటారు. గతంలో సర్ఫేస్ కు హెడ్ గా ఉన్నారు దావులూరి.
పవన్ దావులూరి ఇండియాకు చెందిన వ్యక్తి.. ఐఐటీ మద్రాస్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. మైక్రోసాఫ్ట్ విండో, సర్ఫేస్ కొత్త బాస్ గా బాధ్యతలు తీసుకున్న పవన్ దావులూరి.. అమెరికా సాఫ్ట్ వేర్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయులు సత్య నాదేళ్ల, సుందర్ పిచాయ్ సరసన చేరిపోయాడు.
Also Read: డబ్బున్నోళ్ల సిటీగా ముంబై.. ఆసియాలో టాప్.. వరల్డ్‌లోనే థార్డ్
దావులూరి అమెరికాలోని మేరీలాండ్ యూనివర్సిటీ నుంచి గ్యాడ్రుయేషన్ తర్వాత అప్పటినుంచి 23 సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్నారు. రియబిలిటీ కాంపోనెంట్ మేనేజర్ గా మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం చేరారు.