ఐఐటీ మద్రాస్​లో ఫైన్​ఆర్ట్స్, కల్చరల్ ​రిజర్వేషన్లు

ఐఐటీ మద్రాస్​లో ఫైన్​ఆర్ట్స్, కల్చరల్ ​రిజర్వేషన్లు
  • బీటెక్, బీఎస్ కోర్సుల్లో ఈ కోటాలో రెండు సీట్లు 

చెన్నై: ఐఐటీ మద్రాస్ 2025–26 అకడమిక్ సెషన్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన బీటెక్, బీఎస్​లో ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎక్సలెన్స్ (ఎఫ్​ఏసీఈ) రిజర్వేషన్లు ప్రవేశపెడుతున్నది. ఈ కోటా కింద రెండు సీట్లు ఉంటాయని ఐఐటీ మద్రాస్​ డైరెక్టర్ వి.కామకోటి మంగళవారం మీడియాకు తెలిపారు. 

రెండు సీట్లలో ఒకటి జనరల్ కోటా కాగా, ఒకటి మహిళలకు రిజర్వ్ చేసినట్టు చెప్పారు. జేఈఈ అడ్వాన్స్​డ్ అభ్యర్థులు jeeadv.iitm.ac.in/face పోర్టల్​ద్వారా ఐఐటీఎం ఎఫ్ఏసీఈ అడ్మిషన్​కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.