Manamey First Song: మరోసారి అదరగొట్టిన హేషామ్.. మనమే ఫస్ట్ సాంగ్ సూపర్

Manamey First Song: మరోసారి అదరగొట్టిన హేషామ్.. మనమే ఫస్ట్ సాంగ్ సూపర్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్(Sharwanand) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మనమే(Manamey). దేవదాస్ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య(Sriram Adithya) తెరకెక్కిస్తున్న ఈ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ లో కృతి శెట్టి(Kriti shetty) హీరోయిన్ గా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఖుషీ, హాయ్ నాన్న ఫేమ్ హేషామ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఇక నా మాటే అంటూ సాగే పాటను విడుదల చేశారు. 
 
హేషామ్ స్టైల్లో స్మూతీ అండ్ మెలోడియస్ గా వచ్చిన ఈ పాటకు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట విన్న నెటిజన్స్ హేషామ్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడని, పాట ఇన్ స్టాంట్ చాట్ బస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఒక్కపాట సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చివరిగా ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ అందుకున్న శర్వానంద్ మనమే సినిమాతో ప్రేక్షకులకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ పంచుతారో చూడాలి.