హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషనల్ నాలెడ్జ్ మిలినియం కాన్ఫరెన్స్ (ఐకేఎంసీ) 18 వ ఎడిషన్‌ను హైదరాబాద్‌లో ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఐకేపీ నాలెడ్జ్ పార్క్ (ఐకేపీ) నిర్వహించనుంది. 1999 లో మొదలైన ఐకేపీ, ఈ ఏడాదితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఐకేఎంసీ 2024 లో వివిధ సెక్టార్లలోని బిజినెస్ లీడర్లు, టాప్ రీసెర్చర్లు, ఎంటర్‌ప్రెనూర్లు, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొననున్నారు. సెల్ అండ్ జీన్ థెరపీలో సాధించిన ప్రోగ్రెస్, వన్ హెల్త్, స్మార్ట్ ప్రోటీన్స్ వంటి అంశాలపై చర్చించనున్నారు.
సుమారు 150 కి పైగా ఇన్నోవేటర్లు, స్టార్టప్‌లు తమ ప్రొడక్ట్‌లను ప్రదర్శిస్తాయి. మొదటి రెండు రోజుల ఈవెంట్ హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తారు. ఈవెంట్ మూడో రోజు జెనోమ్ వ్యాలీలోని ఐకేపీ సైన్స్ పార్క్ క్యాంపస్‌లో జరుగుతుంది. ఐకేపీ ఫ్యూచర్ ఫండ్ ద్వారా రెండు స్టార్టప్‌లలో రూ.1.50 కోట్లను ఐకేపీ ఇన్వెస్ట్ చేయనుంది. ఐకేపీ ఫ్యూచర్ స్టార్స్ అవార్డ్ కింద 10 మంది యంగ్ ఎంటర్‌ప్రెనూర్ల (25 ఏళ్ల లోపు వయసున్న) కు రూ.5 చొప్పున గ్రాంట్ ఇవ్వనుంది.