కోటగిరి/ఎడపల్లి/సిరికొండ, వెలుగు: తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గురువారం ఉమ్మడి కోటగిరి, ఎడపల్లి, సిరికొండ మండలాల్లో ఐకేపీ వీవోఏలు వినూత్న రీతిలో ఆందోళన చేశారు.మండల కేంద్రాల్లోని ఐకేపీ బిల్డింగ్స్ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం అక్కడే బైఠాయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఓఏల జీతం రూ. 18 వేలకు పెంచాలని, సెర్ఫ్ఎంప్లాయీస్గా గుర్తించి శాలరీ నేరుగా అకౌంట్లలో వేయాలని డిమాండ్చేశారు. ప్రభుత్వం దిగి వచ్చి డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వీవోఏల యూనియన్ కోటగిరి మండల ప్రెసిడెంట్సరిత, వైస్ప్రెసిడెంట్ సాయిలు, ఎడపల్లిలో.. మండల అధ్యక్షుడు సుదర్శన్, కార్యదర్శి పోచయ్య, సిరికొండలో.. స్వరూప, రాధ, లలిత పాల్గొన్నారు.