ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఐకేపీల వంటావార్పు

నార్కట్​పల్లి, వెలుగు : ఐకేపీ  వీవోఏలు 33 రోజులుగా సమ్మె చేస్తున్నా  రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ  నల్గొండ జిల్లా చిట్యాల పట్టణం కూడలిలో శుక్రవారం వంటావార్పు చేపట్టారు.  బతుకమ్మ ఆడారు. ఈ  సందర్భంగా సీఐటీయూ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు నారాబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్న 33 రోజుల నుంచి  సమ్మె చేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదన్నారు. రాష్ట్రంలో సుమారు 20 వేల మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారని, వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.  వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 22న కలెక్టరేట్​ను, 29న చలో హైదరాబాద్ సర్ప్​ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఏదుళ్ల లక్ష్మి, గుడిసె సువర్ణ, వడ్డగానే విజయ, ఏరుకొండ వెంకన్న, ఆద్దెల ఉమ, వలం దాసు కవిత, గుడిసె పద్మ, బురుగు జ్యోతి, పాకాల సత్యనారాయణ, దేశపాక సత్తమ్మ, వనజా కుమారి, చింత కింది సుమతి, అంతటి వినోద, వడ్డేపల్లి రాణి పాల్గొన్నారు.