రూపేష్, ఆకాంక్ష సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘షష్ఠిపూర్తి’(Shashtipurthi). రాజేంద్ర ప్రసాద్, అర్చన కీలకపాత్రలు పోషిస్తున్నారు. పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ చౌదరి నిర్మాత. ఈ చిత్రంలోని ‘ఏదో... ఏ జన్మలోదో... ఈ పరిచయం’ అనే పాటను త్వరలో విడుదల చేయబోతున్నట్టు బుధవారం ప్రకటించారు.
ఇసై జ్ఞాని ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటకు.. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సాహిత్యం సమకూర్చడం విశేషం. ఇప్పటికే 60కి పైగా పాటలు రాసిన కీరవాణి గారు, ఇళయరాజా గారి బాణీకి సాహిత్యం రాయడం ఇదే తొలిసారని, అది తమ సినిమా కోసం కావడం అదృష్టంగా భావిస్తున్నట్టు దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.