
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ -చివ్వెంల మండలం ఐలాపురం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సీయల్ కళాశాల, పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల.. నిర్వహణ 10 వతరగతి.. ఇంటర్ విద్యార్థులకు చదువుపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు. టీచర్ల హాజరు పట్టీ... వంట గదిలోని.. స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. విద్యార్థులకు మెను ప్రకారం విద్యార్థినిలకు భోజనం ఇవ్వాలని సిబ్బంది కి సూచించారు. పాఠశాల లో విద్యార్థులకు ఇస్తున్న వసతులపై ఆరా తీశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేయాల్నారు. వారిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి ప్రోత్సహించాలంటూ... జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెంచాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.