ఇళయరాజాకు ఆ గుడిలో అవమానం జరిగిందా..? ఎందుకీ రాద్దాంతం.. అసలు ఏం జరిగింది..!

ఇళయరాజాకు ఆ గుడిలో అవమానం జరిగిందా..? ఎందుకీ రాద్దాంతం.. అసలు ఏం జరిగింది..!

తమిళ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గురించి తెలియనివారుండరు. ఇళయరాజా దాదాపుగా 1000కి పైగా సినిమాలకి మ్యూజి డైరెక్టర్ గా పని చేశారు. ఈ క్రమంలో  7వేల కంటే ఎక్కువ పాటలను కంపోజ్ చేశాడు. అంతేగాకుండా పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అవార్డులు కూడా అందుకున్నాడు. అయితే ప్రస్తుతం ఇళయరాజా కి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

అయితే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఇళయరాజా ఆదివారం సాయంత్రం తమిళనాడులోని విరుదునగర్‌లోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయానికి వెళ్లారు. ఇందులోభాగంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయం గర్భ గుడిలోకి ప్రవేశిస్తుండగా అలయ ప్రధాన అర్చకులు ఇళయరాజాను అడ్డుకున్నారు. అలాగే అమ్మవారి గర్భ గుడిలోకి ఇతరులకి అనుమతి ఉండదని కావున బయటినుంచే దర్శించుకోవాలని సూచించారు.

ఇదే సమయంలో ఇళయరాజా వెంట శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీ ఆండాళ్ జీయర్ మఠానికి చెందిన సడగోప చిన రామానుజ జీయర్ తదితరులు కూడా ఉన్నారు.ఆలయ అర్చకులు మాటలు విన్న ఇళయరాజా గర్భగుడిలోకి వెళ్లకుండా బయటినుంచే అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు ఇళయరాజా ని పూలమాలలు వేసి దుశ్శాలువాతో సత్కరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read : అక్కడ భారీగా పడిపోయిన పుష్ప 2 కలెక్షన్స్

ఈ క్రమంలో కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఇళయరాజా దళితుడు కావడంవల్లే ఆలయ గర్భగుడిలోకి ప్రవేశం కల్పించలేదని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆలయ గర్భగుడి చాలా పవిత్రమైనదని కావున అందులోకి ప్రవేశించాలంటే కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు, నియమనిష్టలు ఉంటాయని అందుకే అర్చకులు తప్ప ఇతరులను అనుమతించరని అంటున్నారు.