Ilayaraja: రూ.5 కోట్లు కట్టాలంటూ.. గుడ్ బ్యాడ్ అగ్లీ మేకర్స్కు లీగల్ నోటీసు పంపిన ఇళయరాజా

Ilayaraja: రూ.5 కోట్లు కట్టాలంటూ.. గుడ్ బ్యాడ్ అగ్లీ మేకర్స్కు లీగల్ నోటీసు పంపిన ఇళయరాజా

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. మిక్స్డ్ టాక్ వచ్చినా ఈ యాక్షన్ సినిమా రూ.150 కోట్లకి పైగా గ్రాస్ సాధించి కలెక్షన్ల జోరు చూపిస్తోంది.

ఈ క్రమంలో గుడ్ బ్యాడ్ అగ్లీ వివాదంలో చిక్కుకుంది. తాజాగా సంగీత దర్శకుడు, ఇసైజ్ఞాని ఇళయరాజా.. గుడ్ బ్యాడ్ అగ్లీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌కు లీగల్ నోటీసు పంపారు. అనుమతి లేకుండా తన పాటలను రీ క్రియేట్ చేశారని నోటీసులో తెలిపారు. అందుకు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని, ఏడు రోజుల్లోగా సినిమా నుండి పాటలను తొలగించాలని డిమాండ్ చేశారు. డబ్బు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇళయరాజా హెచ్చరించారు.

అయితే, ఈ సినిమాలో తాను స్వరపరిచిన ఓ మూడు పాత పాటలను గుడ్ బ్యాడ్ అగ్లీ మేకర్స్ వాడుకున్నారు. ఒత్త రువా థారే, ఎన్ జోడి మంజకురువి, ఇలమై ఇధ్హో పాటలను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నందుకు ఇళయరాజా రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసు పంపారు.

►ALSO READ | Vishwambhara: చిరంజీవి ‘రామ..రామ’ పాట కోసం.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే?

మరి ఇళయరాజా పంపిన నోటీసులకు మైత్రి మేకర్స్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. ఈ నోటీసు చిత్ర పరిశ్రమలో సంగీత హక్కులు మరియు అనుమతుల గురించి జరుగుతున్న చర్చలో ఆసక్తిని రేకెత్తించింది. 

ఇళయరాజా పాటలను తన అనుమతి లేకుండా ఎవ్వరు వాడుకున్న ఏ మాత్రం సహించరు. గతంలో ఇలా ఎన్నోసార్లు తన పాటలను వాడుకున్న మేకర్స్ కు నోటీసులు కూడా పంపించారు. గతేడాది మలయాళ మూవీ మంజుమ్మల్ బాయ్స్ సినిమా మేకర్స్ కి కూడా ఇలానే నోటీసులు పంపి హెచ్చరించారు. చాలా రోజులపాటు ఈ వివాదం సాగింది. ఎట్టకేలకు ఆ వివాదం కొలిక్కి ఇచ్చింది.