బాలీవుడ్ మీద ప్రేమతో సౌత్ అవకాశాలన్నింటినీ కాదనుకుని వెళ్లిపోయిన ఇలియానా.. అక్కడ అనుకున్నంత సక్సెస్ కాలేదు. కానీ అడపా దడపా ఏదో ఒక చాన్స్ అయితే సంపాదిస్తోంది. ఆమె అభిషేక్ బచ్చన్‌తో కలిసి నటించిన ‘బిగ్ బుల్’ మూవీ ఓటీటీ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఇలియానా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని అభిషేక్, ఇలియానా సోషల్ మీడియాలో రివీల్ చేశారు. నల్లని సల్వార్ సూటు, కళ్లద్దాలతో ఉన్న ఇలియానా ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. కుకీ గులాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో అజయ్ దేవగన్, ఆనంద్ పండిట్, విక్రాంత్ శర్మ, కుమార్ మంగత్ పాఠక్ నిర్మించారు. అందరూ ద బిగ్ బుల్ గా పిలిచే ఇండియన్ స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా చేసిన ఫైనాన్షియల్ క్రైమ్స్ ఆధారంగా తీస్తున్న సినిమా ఇది. హర్షద్ మెహతా పాత్రని అభిషేక్ బచ్చన్ పోషిస్తున్నాడు. ఇలియానా పోషిస్తున్నది స్కామ్‌ని వెలుగులోకి తెచ్చిన లేడీ జర్నలిస్ట్ సుచేతా దలాల్ పాత్రనా లేక మరేదైనా క్యారెక్టరా అనేది తెలియాల్సి ఉంది. అక్టోబర్‌లో థియేట్రికల్ రిలీజ్ ఉంటుందని గతంలో ప్రకటించిన మేకర్స్.. కరోనా కారణంగా హాట్ స్టా ర్‌లో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇంత మంచి సినిమాలో నటించడం ఎక్సయిటింగ్‌గా ఉంది అంటోంది ఇలియానా. దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన అతి పెద్ద ఫైనాన్షియల్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందిన ఈ మూవీ అయినా ఆమెకు బాలీవుడ్ లో బ్రేక్ ఇస్తుందో లేదో మరి.