Ileana D'Cruz: ఇలియానా కొడుకు ఫస్ట్ బర్త్‌డే సెలెబ్రేషన్స్..ఫోటోలు చూశారా?

గోవా బ్యూటీ, టాలీవుడ్ నటి ఇలియానా 2023లోఆగస్ట్ 1న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తన ముద్దుల కొడుకు ‘కోవా ఫీనిక్స్ డోలన్‌’ని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను..నా హృదయాలను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ గతేడాది వెల్లడించింది. 

తాజాగా ఇలియానా కుమారుడు కోవా ఫీనిక్స్ డోలన్ తన ఫస్ట్ బర్త్‌డే వేడుకలు జరుపుకోగా..ఆ ఈవెంట్ నుంచి కొన్ని ఫోటోలు, వీడియో ఇల్లీ భామ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. సమయం 'అప్పుడే అయిపోయిందా..నా బిడ్డకు 1 సంవత్సరం పూర్తయిందా' అంటూ ఫొటోస్కి క్యాప్షన్ ఇచ్చింది.

ఈ తాజా ఫొటోస్ లో ఇలియానా తన భ‌ర్త‌ మైఖేల్ డోలన్, వార‌సుడు కోవా ఇద్ద‌రితో సెలబ్రేట్ చేసుకుంటున్న ఫోటో ఒక‌టి నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది. అలాగే షేర్ చేసిన వీడియోలో కోవా చాలా ముద్దుగా కలియతిరుగుతూ, బొద్దుగా కనిపిస్తూ నెటిజన్స్ ను అట్ట్రాక్ట్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఇలియానా ప్రియుడు, భ‌ర్త‌ మైఖేల్ డోలన్ ఎట్టకేలకు ఫ్యామిలీతో ప్ర‌త్య‌క్ష‌మయ్యాడంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. కోవా ఫీనిక్స్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ప్రస్తుతం ఇలియానా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం.తనకు స్టార్ డం తెచ్చిన తెలుగు పరిశ్రమ మీదే అమ్మడు ఆశలు పెట్టుకుందట. ఎలాగైనా మేకర్స్ తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా ట్రై చేస్తుందట. ఇలియానా మొన్నటిదాకా సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని అలరించిన అమ్మడు..ఇప్పుడు అదే క్రేజ్ తో సినిమా ఛాన్సులు అందుకోవాలని చూస్తోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే..ఇలియానా చివరగా తెలుగులో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించింది. ఏదైనా సినిమా ఛాన్స్ వస్తే మాత్రం నో లిమిట్స్ అనే రేంజ్ లో అందాల ప్రదర్శనకు సిద్ధం అవుతుందని టాక్. ఏం చేసైనా సరే తెలుగులో చాన్స్ కొట్టేయాలని చూస్తోన్నా ఇలియానాను ఏ డైరెక్టర్ ఆదుకుంటాడో చూడాలి.