సైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. కానీ అదేంటో బయటకు చెప్పను: ఆటో డ్రైవర్ రాణా

సైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. కానీ అదేంటో బయటకు చెప్పను: ఆటో డ్రైవర్ రాణా

ముంబై: ఆపదలో అండగా నిల్చిన తనకు హీరో సైఫ్ అలీ ఖాన్ కృతజ్ఞతగా బహుమతి ఇచ్చాడని.. కానీ అదేంటనేది బయటకు చెప్పనని ఆటో డ్రైవర్ రాణా పేర్కొన్నాడు. కత్తి పోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్‎ను ఆటో డ్రైవర్ రాణా అర్థరాత్రి ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. దీంతో ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‎కు సైఫ్ అలీ ఖాన్ రూ.50 వేల నగదు బహుమతి ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆటో డ్రైవర్ రాణాను మీడియా ప్రశ్నించగా అతడు క్లారిటీ ఇచ్చాడు. ‘‘సైఫ్ అలీ ఖాన్ నాకు బహుమతి ఇచ్చాడు. కానీ అదేంటి అనేది ఎవరికీ చెప్పొద్దని కోరాడు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బయట చెప్పనని సైఫ్‎కు మాట ఇచ్చా.. ఈ మాటకు కట్టుబడి ఉంటా’’ అని రాణా పేర్కొన్నాడు.

ALSO READ | Saif Ali Khan: ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌.. గుండెలకి హత్తుకుని సైఫ్ ఎమోషనల్

సైఫ్ నాకు రూ.50 వేలు ఇచ్చాడని.. రూ. లక్ష ఇచ్చాడని ఊహాగానాలు వినిపిస్తు్న్నాయి.. దీని గురించి ఎవరికి తోచింది వారు అనుకోనివ్వండని.. సైఫ్ నాకు ఏమి ఇచ్చాడనేది మా ఇద్దరి మధ్యే ఉంటుందని స్పష్టం చేశారు. నేను ఏ ప్రతిఫలం ఆశించి సహయం చేయలేదని.. ఆపదలో ఉండటంతోనే ఆదుకున్నానని అన్నాడు. సైఫ్ అలీఖాన్ ఆటో రిక్షా బహుమతిగా ఇస్తే స్వీకరిస్తావా అని మీడియా అడగగా.. ‘‘నేను ఇది కావాలని సైఫ్‎ను ఏమి అడగలేదు.. కానీ అతను ఆటో బహుమతిగా ఇవ్వాలనుకుంటే సంతోషంగా స్వీకరిస్తా’’ అని అన్సర్ ఇచ్చాడు డ్రైవర్ రాణా. 

ALSO READ | దిల్ రాజు తల్లికి తీవ్ర అస్వస్థత.. ఐటీ అధికారుల వాహనంలోనే ఆసుపత్రికి తరలింపు

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‎పై బుధవారం (జవనరి 15) దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో సెలబ్రెటీలకు నిలయమైన బాంద్రాలో ఉన్న తన నివాసంలో సైఫ్ అలీఖాన్‎పై అర్థరాత్రి గుర్తు తెలియని దుండగుడు కత్తితో ఎటాక్ చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు సైఫ్‎ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమయానికి కారు, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో అర్థరాత్రి ఆటోలోనే సైఫ్‎ను ఆసుపత్రికి తరలించారు. ఆ ఆటో డ్రైవరే రాణా.