భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సింగరేణి జె కే హైస్కూల్ గ్రౌండ్లో దసరా ఉత్సవాల్లో భారీగా ప్రజలు పాల్గొన్నారు. జమ్మిపూజ చేసి... రావణవధ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం జబర్దస్త్ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు మున్సిపాలిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
ఇల్లందులో జరిగిన దసరా ఉత్సవాల్లో జబర్దస్తు కళాకారులు సందడి చేశారు. వివిధ కళారూపాలను ప్రదర్శించి ప్రజలను అలరింప చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఆయనతోపాటు ఎమ్మెల్యే కనకయ్య ,మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.