స్పా ముసుగులో వ్యభిచారం..ఆరుగురు యువతులు, విటుడు అరెస్ట్

స్పా ముసుగులో వ్యభిచారం..ఆరుగురు యువతులు, విటుడు అరెస్ట్

పంజగుట్ట, వెలుగు: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పంజాగుట్ట పోలీసులు రైడ్​చేశారు. శ్రీనగర్ కాలనీలోని ఓ బిల్డింగ్​లో కొంత కాలంగా స్పా సెంటర్​నడుస్తోంది. అయితే స్పా ముసుగులో లోపల వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సీసీఎస్​పోలీసులకు సమాచారం అందింది. వారి సహకారంతో పంజాగుట్ట పోలీసులు రైడ్​చేసి ఆరుగురు యువతులను, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిర్వాహకులు పరారీలో ఉన్నారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.