
మణికొండలోని నేక్నాపూర్ ,భాషా కాలనీ లో అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు.. కొరడా ఝుళిపించారు అక్రమంగా నిర్మించిన విల్లాలను, బిల్డింగ్ లను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలను అధికారులు చేపట్టారు.స్థానికులకు , అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జిహెచ్ఎంసి పరిధిలోని అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.