అక్రమ కట్టడాలపై హెచ్‌ఎండీఏ అధికారులు ఉక్కుపాదం మోపారు. అనుమతి లేని భవనాలు, నిర్మాణాలను కూల్చివేశారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ భవనాలపై కొరడా ఝులిపించారు. అనుమతులు లేని భవనాలు కూల్చివేశారు.
రంగారెడ్డి జిల్లాలో హెచ్ఎండీఏ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. కొంతమంది అక్రమార్కులు శంషాబాద్ మున్సిపాల్టీ పరిధిలో రెండు దశాబ్దాల ( 20 ఏళ్ల)నుంచి ఆక్రమించుకుని ఇసుక దంగు హోటల్స్ ఏర్పాటు చేసుకొని .. కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. హెచ్ఎండీఏ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. ఈ విషయంలో గతంలో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆక్రమణలను తొలగిస్తున్నారు.
ALso Read : మమ్మల్ని అడ్డుకున్న విషయాన్ని మరిచిపోయారా?