జీడిమెట్లలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

జీడిమెట్లలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

జీడిమెట్ల, వెలుగు: నిజాంపేట కార్పొరేషన్ బాచుపల్లిలోని ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను స్థానిక రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చివేశారు. బాచుపల్లి సర్వే నంబర్​334లో ప్రభుత్వ భూమి ఉంది. కొందరు సదరు స్థలాన్ని ఆక్రమించి రూమ్స్, షెడ్లు, వ్యాపార సముదాయాల కోసం షట్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. సమాచారం అందుకున్న బాచుపల్లి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలోని 15 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.