వనస్థలిపురంలోఅక్రమ నిర్మాణం కూల్చివేత

ఎల్బీనగర్, వెలుగు: హయత్​నగర్​సర్కిల్ హుడా సాయినగర్​కాలనీ రోడ్​నం.5లో ఓ వ్యక్తి రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఆక్రమణపై రెండేండ్లుగా స్థానికుల నుంచి జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. 120 అడుగుల రోడ్డును 4 అడుగుల మేర ఆక్రమించారని ఫిర్యాదుల్లో పేర్కొంటున్నా బల్దియా అధికారులు స్పందించలేదు. దీంతో కాలనీ వాసులు గతేడాది సెప్టెంబర్​లో హైకోర్టును ఆశ్రయించారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని కోర్టు జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించినా పట్టించుకోలేదు. దీంతో కాలనీవాసులు మరోసారి ఒత్తిడి తేవడంతో సోమవారం అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు.