నాగిరెడ్డి చెరువులో ఆక్రమణల తొలగింపు

సికింద్రాబాద్, వెలుగు: కాప్రా పరిధిలోని నాగిరెడ్డి చెరువులో వెలసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు శుక్రవారం కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదుకు స్పందించిన అధికారులు రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ, మున్సిపాలిటీ అధికారులతో కలిసి విచారణ చేపట్టారు. సర్వే నం.14, 32లో చెరువు స్థలం కబ్జాకు గురైందని తేల్చారు. 

డీఎన్ఆర్ పేరుతో ఫంక్షన్ హాల్ నిర్మించినట్లు గుర్తించారు. శుక్రవారం ఉదయం హైడ్రా అధికారులు జేసీబీలతో ఫంక్షన్​ హాలులోని కొంత భాగాన్ని ప్రహరీ గోడను కూల్చివేశారు. అలాగే యాప్రాల్ పరిధిలోని సర్వే నంబర్​32లో కొందరు దోభీ ఘాట్​ను ఆక్రమించి నిర్మించిన ప్రహరీగోడను కూల్చివేశారు. డీఎన్ఆర్ ఫంక్షన్​హాల్​ యజమాని కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి స్టేటస్​కో తీసుకున్నాడని హైడ్రా అధికారులు తెలిపారు.