స్వాములపై అక్రమంగా కేసులు పెట్టారు

ఆదిలాబాద్, వెలుగు : భైంసాలో హనుమాన్ దీక్ష స్వాములపై అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న స్వాములను నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్​తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భైంసాలో జరిగిన ఘటనకు బాధ్యులను చేస్తూ హనుమాన్ దీక్షలో ఉన్న స్వాములను

అరెస్టు చేసి రిమాండ్​కు పంపించడం చూస్తుంటే హిందువులు, బీజేపీపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్కసును వెళ్లగకుతోందని ఆరోపించారు. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్​కు వ్యతిరేకంగా హనుమాన్ ​మాలాధారులు శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా.. వేరే వర్గానికి చెందిన కొందరు దుండగులు టమాటాలతో దాడికి పాల్పడితే దానికి స్వాములను బాధ్యులను చేస్తూ అక్రమంగా కేసులు బానాయించారని అన్నారు.