పరుశురాం టెంపుల్​ ఆక్రమణలను తొలగించిన అధికారులు

పరుశురాం టెంపుల్​ ఆక్రమణలను తొలగించిన అధికారులు

హైదరాబాద్​ బేగంబజార్​ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.  పరుశురాం టెంపుల్​కు చెందిన 1300 గజాల భూమిని మురారి దాస్​ ముందిడా అనే వ్యక్తి ఆక్రమించి భవనాలను నిర్మించాడు.  ఈ క్రమంలో 1997 ఎండోమెంట్​ అధికారులు హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది.  ఈ పిటిషన్​ ను విచారించిన తెలంగాణ హైకోర్టు  ఆ ప్రదేశంలో ఆక్రమణలు తొలగించి  భూమినా స్వాధీనం చేసుకోవాలని ఎండోమెంట్​ అధికారులకు 2022లో ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటినుంచి ఎండోమెంట్​ అధికారులు కబ్జా దారులను ఖాళీ చేయాలని కోరుతున్నారు.  అయినా ఆక్రమణదారులు ఖాళీ చేయకపోవడంతో...  హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్​ 28, 2024న పోలీసుల సమక్షంలో భవనాలు కూల్చివేశారు. ఆక్రమణలు తొలగిస్తుండగా.. అధికారులకు.. కబ్జా దారులకు మధ్య వాగ్వాదం జరిగింది. అధికారులు ఆక్రమణ రాయుళ్లు దౌర్జన్యానికి దిగారు.  కూల్చివేతలు ఆపాలని.. ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాలని కోరుతున్నారు. 

ALSO READ | సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా హవాలా నగదు పట్టివేత