
పద్మారావునగర్, వెలుగు: బన్సీలాల్‌పేట మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ఆవరణలోని అక్రమ నిర్మాణాన్ని నార్త్‌జోన్ జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో మల్టీపర్పస్ఫంక్షన్హాల్ఆవరణలో ‘హాల్కమిటీ సభ్యుల ఆఫీసు’ పేరిట ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించారని, బీఆర్ఎస్లీడర్లు అక్రమంగా వాడుకుంటున్నారని కాంగ్రెస్లీడర్లు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు డిప్యూటీ కమిషనర్ఆదేశాల మేరకు నేలమట్టం చేశారు. టౌన్‌ప్లానింగ్ సిబ్బంది జగదీశ్, పాండు, వెంకటేశ్, రఘు పాల్గొన్నారు.