రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్పల్లి డివిజన్ లో ఫుట్పాత్ లపై అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించారు మున్సిపల్ అధికారులు. గురువారం(అక్టోబర్24) మైలార్ దేవ్ పల్లి పరిధిలోని ఫుట్ పాత్ లను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. మధుబన్ కాలనీలో ఫుట్ పాత్ లను ఆక్రమించి పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. దీంతో పాదచారులకు ఇబ్బందులు తలెత్తాయి. జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన రేకుల షెడ్లు, నిర్మాణాలను నేలమట్టం చేశారు.