గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్ట్

గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్ట్
  • 22 కిలోల గంజాయి, రెండు కార్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం 

చౌటుప్పల్, వెలుగు: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఐదుగురిని యాదాద్రిభువనగిరి ఎస్ వోటీ, చౌటుప్పల్  పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్  సీఐ మన్మధ కుమార్  తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్  బాలాపూర్ కు చెందిన మహమ్మద్  ఇమ్రానుద్దీన్, సంతోష్ నగర్ కు చెందిన అబ్దుల్ ఆసిఫ్, మోసిన్ ఖాన్, సయ్యద్  ఇస్మాయిల్, చంద్రాయన్ గుట్టకు చెందిన మహమ్మద్ అమీర్  కలిసి కొంత కాలంగా ఒడిశా నుంచి గంజాయిను సప్లై చేస్తున్నారు. శనివారం హైదరాబాద్ కు షిఫ్ట్  కారు డిక్కీలో గంజాయి భద్రపరిచి, ముందు థార్​ కారును ఎస్కార్ట్ గా బయలుదేరారు. పక్కా సమాచారంతో పంతంగి టోల్​ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. 22 కిలోల గంజాయి, రెండు కార్లు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు.