ఉప్పల్​ లో ఫుట్‌పాత్ ఆక్రమణలు కూల్చివేత

ఉప్పల్​ లో ఫుట్‌పాత్ ఆక్రమణలు కూల్చివేత

ఉప్పల్ లో జీహెచ్​ఎంసీ అధికారులు ఫుట్​ పాత్​లపై ఆక్రమణలను తొలగిస్తున్నారు.  ఉప్పల్​ మార్కెట్​ ప్రధాన రహదారిపై  పుట్​పాత్​ పై ఉన్న అక్రమ కట్టడాలను  తొలగించారు.  నిబంధనలకు విరుద్దంగా ఫుట్​పాత్​ పై అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టారు.  రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ ఆక్రమణలను జీహెచ్​ఎంసీ సిబ్బంది  తొలగిస్తున్నారు. 

జీహెచ్​ఎంసీ  అధికారులు జేసీబీలు, ఇతర యంత్రాలతో ఫుట్ పాత్ ఆక్రమణలు పూర్తిగా తొలగించారు.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు అధికారులు తొలగిస్తున్నారు. పుత్ పాత్ పై వేసిన డబ్బాలను తొలగించిన తర్వాత తిరిగి నిర్వహిస్తే షాపు లైసెన్సు రద్దు చేసి.. . భారీ జరిమానా విధించడమే కాకుండా.. కేసు నమోదు చేస్తామని జీహెచ్​ఎంసీ అధికారులు తెలిపారు.

ALSO READ | బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పిటిషన్లపై విచారణ వాయిదా

గత కొన్ని రోజులుగా ఉప్పల్​ మార్కెట్​ కు  వెళ్లే  ప్రధార రహదారిని దుకాణ సముదాయాలు, వ్యాపారస్తులు రోడ్డుపై ఫుట్ పాత్‌ల‌ను ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం సమయంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీనికి తోడు స్కూల్ బస్సులు ఇతర పెద్ద వాహనాలు ఈ దారుల గుండా రావాలంటే గగనంగా మారింది.