అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారివద్ద నుంచి 5.3 కిలోల గంజాయిని సైబరాబాద్ SOT మేడ్చల్ టీమ్ స్వాధీనం చేసుకున్నారు.
సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ లోని హేమావతి నగర్, హమాలీబస్తీ, మోతీనగర్ చెందిన రాకేష్ అనే పాత నేరస్తుని పట్టుకుని.. అతని ఇంటి నుంచి 1.3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతనిచ్చిన సమాచారం మేరకు బల్కంపేట్ ప్రాంతంలోని అతని స్నేహితుడు పవన్ ఇంట్లో మరో 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ భువనేశ్వర్‌కు నుంచి గంజాయిని తీసుకుని వచ్చి.. సనత్ నగర్, బల్కంపేట పరిసరాలలో రోజువారీ కూలీలు, విద్యార్థులకు చిన్న చిన్న పాకెట్స్ గా చేసి అమ్ముతున్నట్లుగా తెలిసింది. ఒరిస్సా నుంచి తీసుకుని వచ్చిన 6 కేజీల గంజాయిని తీసుకువచ్చారని.. దానిలో నుంచి 700 గ్రాముల గంజాయిని చిన్న పాకెట్లలో కూలీలకు అమ్మారని పోలీసులు పేర్కొన్నారు. సనత్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేసి దర్యాప్తు చేపట్టారు.