అర్ధరాత్రి గుట్కా అమ్ముతూ..పోలీసులతో దురుసు ప్రవర్తన

  • పాన్ షాప్ ఓనర్ ​అరెస్ట్

కంటోన్మెంట్, వెలుగు: అర్ధరాత్రి టైంలో గుట్కా, సిగరెట్లు అమ్మడమే కాకుండా, షాప్ ​క్లోజ్​చేయించేందుకు వచ్చిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని బోయినపల్లి పోలీసులు అరెస్ట్ ​చేశారు. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ సిక్ విలేజ్​కు చెందిన మహ్మద్ నవాజ్(41) స్థానిక ​మెయిన్ రోడ్డు పక్కన పాన్​షాప్ నడుపుతున్నాడు. అయితే నవాజ్ ​అర్ధరాత్రి దాటినా షాప్​క్లోజ్​ చేయడం లేదు. పైగా మైనర్లు, యువకులకు నిషేధిత గుట్కా, సిగరెట్లు అమ్మతున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఇప్పటికే నవాజ్​కు రెండుసార్లు వార్నింగ్​ఇచ్చి, ఫైన్ ​వేశారు. అయినప్పటికీ నవాజ్​లో మార్పు రాలేదు. సోమవారం అర్ధరాత్రి వరకు షాప్ కొనసాగిస్తుండడంతో పోలీసులు వెళ్లి క్లోజ్​చేయమనగా నవాజ్​వారితో దురుసుగా ప్రవర్తించాడు. దాడికి దిగాడు. బోయినపల్లి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నవాజ్ కు మూడ్రోజుల జైలు శిక్షతో పాటు  ఫైన్ ​వేసింది.