- ఏడుగురిపై క్రిమినల్ కేసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్న ఏడుగురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. శంషాబాద్ సెక్షన్ పరిధిలోని కుమ్మరి బస్తీ, యాదవ్ బస్తీ, కప్పుగడ్డ ప్రాంతాల్లో ఉంటున్న బి.రవి, బి.కృష్ణ, బి.కుమార్, బి.అంజయ్య, మహబూబీ, కె.బాలరాజ్, టి.భాస్కర్ ఇండ్లకు రెండు చొప్పున నల్లా కనెక్షన్లు ఉన్నట్లు జలమండలి విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఒక్కో నల్లా కనెక్షన్ కు మాత్రమే అనుమతి ఉన్నట్టు తెలుసుకున్నారు. అధికారుల ఫిర్యాదుతో ఏడుగురిపై ఎయిర్పోర్టు పీఎస్లో క్రిమినల్కేసులు నమోదయ్యాయి.