- ఇబ్బందులు పడుతున్న జనం
పద్మారావునగర్, వెలుగు : గాంధీ హాస్పిటల్ బస్సులు ఆగే బస్టాప్ స్థలం వద్ద ప్రైవేటు కార్లు, ఆటోలు పెద్ద సంఖ్యలో అక్రమంగా పార్కింగ్ చేస్తున్నారు. దీంతో బస్సుల కోసం కనీసం వేచి ఉండడానికి కూడా జనాలకు స్థలం లేకుండా పోతుంది. నిత్యం వేలాది వెహికల్స్ వెళ్లే సికింద్రాబాద్, ముషీరాబాద్ మెయిన్ రోడ్డుపైన జనాలు బస్సుల కోసం నిల్చోవడం ప్రమాదకరంగా మారింది. ఇప్పటికైనా ట్రాఫిక్ అధికారులు స్పందించి, గాంధీ బస్టాప్ ప్రాంతంలో అక్రమ పార్కింగ్ వెహికల్స్‌ను తొలిగించాలని ఇక్కడ ఆర్టీసీ అధికారులు గతంలో మాదిరిగా ఒక బస్సు షెల్టర్‌ను నిర్మించాలని కోరుతున్నారు.