ఆందోల్​ మండలంలో రేషన్​ బియ్యం పట్టివేత

ఆందోల్​ మండలంలో రేషన్​ బియ్యం పట్టివేత

జోగిపేట, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న రేషన్​బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ పాండు తెలిపారు. ఆందోల్​ మండలలో పరిధిలోని నేషనల్​ హైవేపై సంగుపేట సమీపంలో గురువారం రేషన్​బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. సిబ్బందితో కలిసి వెళ్లి కంటేనర్​లో తరలిస్తున్న 248 క్వింటాళ్లు  రేషన్​ బియ్యం పట్టుకున్నట్లు తెలిపారు. డ్రైవర్​అసిఫ్​ను అదుపులోకి తీసుకొని, వాహనం సీజ్​చేసి పట్టుకున్న బియ్యాన్ని సివిల్​సప్లయ్​శాఖకు అప్పగించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.  

సిద్దిపేటలో 52 క్వింటాళ్లు.. 

సిద్దిపేట రూరల్: అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్​బియ్యాన్ని పట్టుకొని సీజ్​చేసినట్లు సిద్దిపేట టాస్క్​ఫోర్స్​పోలీసులు తెలిపారు. చిన్నకోడూర్ పీఎస్​పరిధిలోని మల్లారం ఎక్స్ రోడ్ వద్ద అశోక్ లేలాండ్ వాహనంలో సిద్దిపేటకు చెందిన వానరాశి రాజు ఎలాంటి అనుమతి లేకుండా రేషన్ బియ్యం తరలిస్తున్నాడన్న సమాచారంతో పోలీసులతో కలసి దాడి చేశామన్నారు.

వాహనంలో తరలిస్తున్న 40 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి సికింద్లపూర్ లో ఆనరాశి సంపత్, ముక్కర నరసయ్య ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం దాచిపెట్టారన్న సమాచారంతో వెళ్లి12 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.