డిండి, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని చెరుకుపల్లి గేట్ వద్ద ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... ట్రాలీ వెహికల్లో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆదివారం ఉదయం
తరలిస్తుండగా పక్కా సమాచారంతో మండల పరిధిలోని చెరుకుపల్లి గేటు వద్ద పట్టుకున్నారు. అనంతరం డ్రైవర్ రమేశ్, ఓనర్ రాత్లావత్ బిచ్చాలు పై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.