అక్రమంగా నిలువ చేసిన ఇసుక సీజ్

అక్రమంగా నిలువ చేసిన ఇసుక సీజ్

గుండాల, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముత్తాపురం పంచాయతీలో సర్వే నంబర్ 39 భూమిలో 18 వందల ఇసుక ట్రాక్టర్ల కుప్పలను సీజ్ చేసినట్లు తహసీల్దార్ ఇమ్మానియేల్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.  ఇసుక నిలువ ఎవరు చేశారో గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.

ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూగర్భజల వనరుల ఆఫీసర్ కు, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ కు ఈ విషయాన్ని తెలియజేసినట్లు చెప్పారు. పర్మిషన్ లేకుండా ఇసుక తరలించినా, నిలువ చేసినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.