మానకొండూర్, వెలుగు: మానకొండూర్ మండలంలో అధికారుల అండదలతో అక్రమ మట్టి వ్యాపారం జోరుగా సాగుతోంది. రాత్రి వేళల్లో వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. మండలంలోని అన్నారం శివారు జవహర్ కుంట, ముంజపల్లి లోని ఒడుకుంట లనుంచి ప్రతి రోజు రాత్రుల్లో జే సీ బీ ల ద్వారా మట్టిని తీస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన మట్టి తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. మానకొండూర్, ముంజంపల్లి, ఈదులగట్టెపల్లి గ్రామాలకు చెందిన మట్టి వ్యాపారులు అధికారుల అండదండలతో అక్రమ మట్టి వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు
జవహర్ కుంటలో నుంచి ప్రతిరోజు అక్రమంగా మట్టి తరలిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. మట్టి ఎక్కువ తీయడంతో కుంట బావిని తలపిస్తుంది. చుట్టుపక్కల రైతుల బావుల్లో నీళ్లు అడగంటి పోయి భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయి.
బండ రాజిరెడ్డి రైతు , అన్నారం