అక్రమ నిర్మాణాలను కూల్చేసుకున్న నిథమ్

అక్రమ నిర్మాణాలను కూల్చేసుకున్న నిథమ్

గచ్చిబౌలి, వెలుగు :  గచ్చిబౌలిలోని నిథమ్(నేషనల్​ఇనిస్టిట్యూట్​ఆఫ్​టూరిజం అండ్​హాస్పిటాలిటీ మేనేజ్​మెంట్) క్యాంపస్​లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను యాజమాన్యం మంగళవారం కూల్చివేసింది. సర్వే నంబర్​71లో మూడు ఎకరాలకు పైగా రామమ్మకుంట చెరువు విస్తరించి ఉంది. ఎఫ్​టీఎల్ పరిధితో కలుపుకుని దాదాపు 5 ఎకరాలు ఉంటుంది. ఈ చెరువును ఆనుకుని నిథమ్​క్యాంపస్​ఉంది. 

కొన్నేండ్ల కింద కాలేజీ మేనేజ్​మెంట్ చెరువు బఫర్​జోన్ ను ఆక్రమించి బిల్డింగ్​నిర్మాణం చేపట్టింది. చెరువు స్థలాన్ని పూడ్చి కట్టడాన్ని గుర్తించిన స్వచ్ఛంద సంస్థలు, హెచ్ఆర్​సీపీసీ హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో బిల్డింగ్​నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. విచారణ అనంతరం ఇటీవల హైకోర్టు సదరు నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో నిథమ్​ మేనేజ్​మెంట్​మంగళవారం జేసీబీలతో కూల్చివేత చేపట్టింది.