పోలీస్ బందోబస్త్తో మూసీ ఆక్రమణలకు మార్కింగ్..

పోలీస్ బందోబస్త్తో మూసీ ఆక్రమణలకు మార్కింగ్..

గ్రేటర్ హైదరాబాద్ లో  మూసీ ప్రక్షాళన మొదలైంది . చాదర్ ఘాట్,మూసా నగర్, శంకర్ నగర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో  పోలీస్ బందోబస్తు మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టీంలు సర్వే చేస్తున్నాయి.  ఆక్రమణలు గుర్తించి కూల్చి వేసే ప్రాంతాలను మార్కింగ్ వేస్తున్నారు రెవెన్యూ అధికారులు. కూల్చి వేసే ఇండ్ల కొలతలు తీసుకుని మార్క్ చేస్తున్నారు.  

Also Read:-బాంబులతో..అక్రమ భవనాలు కూల్చేస్తున్న హైడ్రా

మూసీ రివర్ బెడ్ లోని ఇండ్ల సర్వేకు ప్రభుత్వం 25 స్పెషల్ టీంలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో టీంలో తహసీల్దార్ తో పాటు ఐదుగురు ఆఫీసర్లు ఉన్నారు.  మూసీ పరివాహక ప్రాంతంలో 2166 ఇంట్లు ఉన్నట్లు ఇప్పటికే  గుర్తించారు అధికారులు. అక్కడి  వారిని కలిసి ఖాళీ చేసేందుకు ఈ స్పెషల్ టీంలు ఒప్పించనున్నాయి. మూసీ రివర్ బెడ్ లోని వాళ్లకు డబుల్ బెడ్రూం ఇళ్లు..బఫర్ జోన్ లోని వాళ్లకు నష్టపరిహారంతో పాటు ఇండ్లు కేటాయించనుంది ప్రభుత్వం.