- తొలగించేందుకు రెడీ అయిన రెవెన్యూ ఆఫీసర్లు
- అభ్యంతరాలకు 15 రోజుల గడువు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 14.2 కి.మీ మేర విస్తరించి ఉన్న మూసీ నదిలో 6 వేలకు పైగా ఆక్రమణలు ఉన్నట్లు రెవెన్యూ ఆఫీసర్లు గుర్తించారు. వాటిలో నదిలో 978, బఫర్‌జోన్‌లో నదికి ఇరువైపులా 5,501 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. అందులో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ఉన్నాయి. మూసీ పరివాహక ప్రాంతం పాత రికార్డుల ప్రకారం ఈ సంఖ్య రెట్టింపులో ఉంది. పకడ్బందీగా సర్వే నిర్వహించిన రెవెన్యూ ఆఫీసర్లు ప్రస్తుతం మూసీ పరిధిలో బౌండరీలు నిర్ణయించే పనిలో పడ్డారు.
ఇందులో భాగంగా మూసీ ఒడ్డు నుంచి ఇరువైపులా 50 మీటర్ల చొప్పున బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు ఉన్నా కూల్చేందుకు రెడీ అయ్యారు. లంగర్‌హౌస్‌లోని టిప్పుఖాన్ బ్రిడ్జి నుంచి నాగోలు బ్రిడ్జి వరకు ఫస్ట్ ఫేజ్ లో14.2 కి.మీ మేర హద్దులు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మంగళవారం ఆక్రమణల వివరాలను జిల్లాలోని ఆర్డీవో ఆఫీస్‌తోపాటు తహసీల్దార్ఆఫీసులు, పీఎస్‌లు, మున్సిపల్, సంబంధిత ప్రభుత్వ ఆఫీసుల వద్ద ఉన్న నోటీసు బోర్డుల్లో పెట్టారు. అభ్యంతరాలుంటే సరైన డాక్యుమెంట్లతో ఫిబ్రవరి 9లోపు ఆయా తహసీల్దార్, ఆర్డీవో ఆఫీసులో తెలియజేయాలని రెవెన్యూ అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి