
లింగంపేట,వెలుగు: లింగంపేట మండలం బోనాల్ శివారులోని అడవుల్లో చెట్ల కూల్చివేతలు ఆగడం లేదు. అటవీభూముల కబ్జాల కోసం కొందరు చెట్లను కోతమిషన్ల తో కూల్చివేస్తున్నారు. బోనాల్గ్రామ సమీపంలోని నీలగిరి ప్లాంటేషన్‌కు ఎదురుగా ఉన్న అడవిలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో లక్షల విలువజేసే టేకు చెట్లను ఇటీవల కూల్చివేశారు.
ఈ విషయంపై ఈనెల16 న వెలుగు దినపత్రికలో ‘అడవికబ్జా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. అయినప్పటికీ ఫారెస్టు ఆఫీసర్లు ఎలాంటి విచారణా చేపట్టలేదు. ఈ విషయంపై ఎఫ్డీఓ రామకృష్ణను వివరణ కోరగా.. చెట్ల నరికివేతలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, చర్యలు తీసుకుంటామని తెలిపారు.