హుజూర్నగర్ డివిజన్లో అక్రమ వెంచర్లను గుర్తించాలి

హుజూర్ నగర్, వెలుగు: డివిజన్ లో అక్రమ లే అవుట్లను గుర్తించాలని అడిషనల్​ కలెక్టర్​ ప్రియాంక అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఆమె పట్టణంలోని వీపీఆర్​ వెంచర్​ను ఆర్డీఓ జగదీశ్వర్​రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ ఆఫీస్ లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. 

నేరేడు చెర్ల, హుజూర్ నగర్ మున్సిపల్ పరిధిలో అక్రమ లే అవుట్లను తహసీల్దార్, సర్వేయర్ల తో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కమిటీని ఆర్డీవో పర్యవేక్షించాలని తెలిపారు. లే అవుట్ లలో ప్రభుత్వానికి కేటాయించిన 10 శాతం స్థలం లో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశం లో హుజూర్ నగర్ , నేరేడుచేర్ల మున్సిపల్ కమిషనర్లు, కె. శ్రీనివాస రెడ్డి , వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.