వేములవాడరూరల్, వెలుగు : వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టకున్నట్లు వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ తెలిపారు. ఎస్‌ఐ మాట్లాడుతూ ఎదురుగట్ల గ్రామానికి చెందిన పస్తం శ్రీనివాస్ ప్రజల నుంచి రేషన్ బియ్యం
సేకరించి ఎక్కువ ధరకు ఇతర ప్రాంతాల్లో అమ్మేవాడు. ఈక్రమంలో మంగళవారం ఆటోలో బియ్యం తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.