కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం : ఎమ్మెల్యే కోరం కనకయ్య

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం : ఎమ్మెల్యే  కోరం కనకయ్య

కామేపల్లి, వెలుగు : ప్రజాసంక్షేమం, అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఆదివారం మండలంలోని పాత లింగాల గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలోని హైస్కూల్ లో సైన్స్ ల్యాబ్ భవనాన్ని, రామకృష్ణాపురం గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మండల కేంద్రంలో కమ్యూనిటీ టాయిలెట్ బ్లాక్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎన్ని ఇబ్బందులు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తోందని చెప్పారు. ఇది చూసి ఓర్వలేక ఇందిరమ్మ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. 

కాగా,  సీతారామ ప్రాజెక్ట్ లో భూమి కోల్పోతున్న తమకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యేకు  నిర్వాసితులు వినతిపత్రం అందజేశారు. రైతుల పరిస్థితిని సీపీఎం నేత  దుగ్గి కృష్ణ ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, డీసీసీబీ  డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గింజల నరసింహా‌రెడ్డి,  నాయకులు ఏపూరి మహేందర్, పత్తే అహ్మద్, తోటకూరి శివయ్య, మద్దినేని రమేశ్, కామేపల్లి సొసైటీ వైస్ చైర్మన్ గుజ్జర్లపూడి రాంబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బావ్‌‌సింగ్, తహసిల్దార్ సుధాకర్, ఎంపీడీవో రవీందర్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ తారా దేవి, ఏపీవో రాణి తదితరులు పాల్గొన్నారు. 

ముత్యాలమ్మ తల్లి పునః ప్రతిష్ఠ వేడుక..

 కామేపల్లి మండలంలో షఊట్కూరు ఎస్టీ  కోయ గుంపు కాలనీలో ముత్యాలమ్మ పునప్రతిష్ఠ వేడుకకు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులు ఏపూరి మహేందర్, షేక్ ఫతే మహమ్మద్, డీసీసీబీ  డైరెక్టర్, మాజీ జడ్పీటీసీ  మేకల మల్లిబాబు యాదవ్ కూడా ఉన్నారు.