బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ : కోరం కనకయ్య

కామేపల్లి, వెలుగు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  : బంజారా ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజ్ అని ఇల్లెందు ఎమ్మెల్యే  కోరం కనకయ్య అన్నారు. శనివారం కామేపల్లి లో ఎల్ హెచ్ పీఎస్ జిల్లా నాయకుడు  భూక్య నాగేంద్రబాబు అధ్యక్షతన మండల స్థాయిలో నిర్వహించిన సంతు సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సేవలాల్ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం నిర్వహించే భోగి బండార్​ కార్యక్రమం విశిష్టమైనదని, బంజారా జాతి గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నారు. అంతకుముందు బంజారాల సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మాజీ ఎంపీ పోరిక బలరాం నాయక్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి గోపాల్ రెడ్డి, ఏఐసీసీ ఆదివాసి జాతీయ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్​నాయక్, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు  పాల్గొన్నారు.