గురుకుల స్కూళ్లో 44 మంది విద్యార్థులకు అస్వస్థత

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధ పడుతున్నారు. విద్యార్థుల్లో ఐదుగురు ఎక్కువగా ఇబ్బంది పడుతుండటంతో గవర్నమెంట్ హాస్పిటల్‎కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా విద్యార్థులకు జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ పర్యవేక్షణలో స్కూల్‎లోనే ట్రీట్మెంట్ అందించారు. వైద్య, విద్యా శాఖ అధికారులు హాస్టల్‎లోని కిచెన్, డైనింగ్ హాల్‎ను పరిశీలించారు. వాటర్ శాంపిళ్లను టెస్ట్ కోసం పంపించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులకు వడదెబ్బ తగిలి ఉంటుందని DMHO సుధాకర్ లాల్ అన్నారు. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక వివరాలు తెలుస్తాయని ఆయన చెప్పారు. ఉదయం పులిహోర తిన్న తర్వాత ఇబ్బంది తలెత్తినట్లు విద్యార్థులు చెబుతున్నారు.

For More News..

ఏపీలో కరెంట్ బిల్లుల పెంపు.. తెలంగాణకు ఏపీకి తేడా ఇదే!

ప్రభుత్వ వాహనాలకు కూడా స్టిక్కర్లు తీసేయాలి

ఈటల లేని పార్టీ తండ్రి లేని కుటుంబంలా మారింది

వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన కోదండరాం