సిరిసిల్ల టౌన్ లో నెమలి
సిరిసిల్ల కలెక్టరేట్,వెలుగు: సిరిసిల్ల టౌన్ గాంధీ సెంటర్ లో నెమలి ప్రత్యక్షమైంది. గురువారం ఉదయం ఓ హోటల్ పై నుంచి నెమలి కిందికి దూకింది. ఇంతలో అక్కడ టీ తాగుతున్న స్థానికులు దాన్ని పట్టుకొని ఫారెస్ట్ఆఫీసర్లకు సమాచారమిచ్చారు. వారు స్పందించకపోవడంతో ఫారెస్ట్ఆఫీస్కు వెళ్లి నెమలిని అప్పగించారు.
శతాధిక వృద్ధురాలు మృతి
సైదాపూర్,వెలుగు: సైదాపూర్మండలం ఎఖ్లాస్పూర్గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, శతాధిక వృద్ధురాలు ఆకుబత్తిని వెంకమ్మ(101) గురువారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు ఫ్యామిలీ మెంబర్స్తెలిపారు. ఈమె కొంతకాలంగా వృద్ధాప్య సమస్యతో బాధపడుతూ ఇంటివద్ద ట్రీట్మెంట్తీసుకుంటున్నారు.
ప్లాస్టిక్ వినియోగం మానేయాలి
కరీంనగర్‌టౌన్, వెలుగు: ప్లాస్టిక్ వినియోగాన్ని స్వచ్ఛందంగా నివారించాలని ఆర్విన్ట్రీ స్కూల్చైర్మన్ రమణారావు పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భగత్ నగర్ లోని ఆర్విన్ ట్రీ స్కూల్ లో గురువారం ఎకో రాఖీలు తయారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని సంరక్షించే వస్తువులతో ఎన్నో అందమైన రాఖీలను తయారుచేయవచ్చన్నారు. లయన్స్ క్లబ్ సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ చైర్ పర్సన్ రాగి వందన, అకాడమిక్ డైరెక్టర్ విజయలక్ష్మి,టీచర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు. భగవతి స్కూల్ లో రాఖీ సెలబ్రేషన్స్ భగత్‌నగర్‌లోని భగవతి స్కూల్లో బ్లాక్ అండ్ వైట్ ముందస్తు రాఖీ వేడుకలు జరిగాయి. వైట్, బ్లాక్కలర్స్తో వేదికను అలంకరించగా, చిన్నారులు తమ వస్త్రధారణతో అలరించారు. కార్యక్రమంలో చైర్మన్ రమణారావు, కరెస్పాండెంట్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
కార్మికులకు లాభాల్లో 35 శాతం వాటా పంచాలి
కమాన్ పూర్ (రామగిరి), వెలుగు: లాభాల బాటలో నడుస్తున్న సింగరేణిలో నిధులు దుర్వినియోగమవుతున్నాయని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య అన్నారు. గురువారం ఆర్జీ-3 ఏరియాలోని ఏఎల్ పీ గని లో ఏర్పాటు చేసిన ద్వార సమావేశానికి చీఫ్‌గెస్ట్‌గా సత్తయ్య హాజరయ్యారు . ముందుగా గని ఆవరణలో బిఎంఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులకు సింగరేణి లాభాల్లో 35 శాతం వాటా పంచాలన్నారు. సంస్థలో జరుగుతున్న కుంభకోణాలను బయటపెట్టేందుకు కార్మికుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు అరుకాల ప్రసాద్, స్వామి, విద్యాసాగర్, ఐలయ్య, సతీశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.
గురుకులం స్టూడెంట్స్ కు అస్వస్థత
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవానీనగర్ లో గల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కు చెందిన 11 మంది స్టూడెంట్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్కూల్లో స్టూడెంట్స్ కు గేమ్స్ నిర్వహించారు. 8, 9 క్లాస్ లకు చెందిన పదకొండు మంది స్టూడెంట్స్ గేమ్స్ఆడిన తర్వాత రూమ్‌లోకి వెళ్లి సృహ తప్పి పడిపోయారు. స్కూల్ నిర్వాహకులు వారిని జగిత్యాల జనరల్ హాస్పిటల్‌కు తరలించి ట్రీట్మెంట్అందిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని డాక్టర్స్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాస్పిటల్‌కు వెళ్లి స్టూడెంట్స్‌ను పరామర్శించారు.
సంస్థాన్ బండలింగాపూర్ ను మండలం చేయాలి
మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి మండలంలోని సంస్థాన్ బండలింగాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌చేస్తూ గ్రామస్తులు గురువారం రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు మాట్లాడుతూ గతంలో బండలింగపూర్ సంస్థాన్ గా ఉండేదని ప్రస్తుతం మేజర్ పంచాయతీ గా ఉందన్నారు. ఇటీవల కొత్త మండలాలు ప్రకటించిన సర్కార్ బండలింగపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించకపోవడం నిరాశకు గురిచేసిందన్నారు. మండల కేంద్రంగా ప్రకటించే వరకు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెప్పాల రాజం, గ్రామ పెద్దలు గంగస్వామి, గంగారెడ్డి, బాలయ్య, తుక్కారం తదితరులు పాల్గొన్నారు.
రాజన్న హుండీ ఆదాయంరూ. కోటి 50 లక్షలు
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భారీగా హుండీ అదాయం సమకూరింది. గురువారం ఆలయ ఓపెన్ స్లాబ్‌లో సీసీ కెమెరాలు, బందోబస్తు మధ్య హుండీలను లెక్కించారు. 30 రోజుల అదాయం రూ. కోటి 51 లక్షల 39 వేలు రాగా, 184 గ్రాముల బంగారం, 4 కిలోల 200 గ్రాముల వెండి వచ్చింది. ఈఓ రమాదేవి పర్యవేక్షించారు